తిరుచ్చి ఈస్ట్‌లో నామినేషన్ దాఖలు చేసిన టీవీకే విజయ్

by Malleboina Mahesh |

తమిళనాడు ఎన్నికల బరిలో విజయ్! తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు. ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న ఫలితాలు. విజిల్ గుర్తుపై పోటీ.

తిరుచ్చి ఈస్ట్‌లో నామినేషన్ దాఖలు చేసిన టీవీకే విజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే (TVK) అధినేత విజయ్ (vijay) తన ఎన్నికల ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. గురువారం (ఏప్రిల్ 2, 2026) మధ్యాహ్నం ఆయన తిరుచిరాపల్లి (తూర్పు) నియోజకవర్గ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు ఆయన చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి కూడా నామినేషన్ వేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటం విశేషం. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో తిరుచ్చి నగరం జనసంద్రమైంది.

ఇదిలా ఉంటే విజయ్ మొదట ఎన్డీయే కూటమిలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఏ కూటమిలో చేరుకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో నిల్చున్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 భృతి, మహిళల రక్షణ, డ్రగ్స్ రహిత తమిళనాడు వంటి హామీలను ప్రకటించారు. అగ్రనేతలకు పోటీగా విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటంతో ఈసారి తమిళనాడు ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి.

Next Story