- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొక్కిసలాటకు TVK ప్రతినిధులే కారణం.. విజయ్‌కి చెన్నై పోలీసుల స్ట్రాంగ్ కౌంటర్
కరూర్ (Karur) తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, దళపతి విజయ్ (Vijay) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కరూర్ (Karur) తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, దళపతి విజయ్ (Vijay) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ (CM Stalin) కావాలనుకుంటే తన మీద ప్రతీకారం తీర్చుకోవాలని, ఏ పాపం తెలియని తమ పార్టీ నాయకులపై చూపించొద్దని కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కరూర్ తొక్కిసలాటకు కారణం ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలోనే దళపతి విజయ్ ఆరోపణలకు చెన్నై పోలీసులు (Chennai Police) స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కరూర్ తొక్కిసలాటపై టీవీకే పార్టీ బ్లేమ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. కరూర్ ర్యాలీ గురించి విజయ్ తన వీడియోలో పూర్తిగా అసత్యాలు చెప్పారని ఆరోపించారు. క్రౌడ్‌ను నియంత్రించడంలో పోలీసులు విఫలం కాలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యం కానే కాదని ధ్వజమెత్తారు. తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణం టీవీకే (TVK) పార్టీ ప్రతినిధులేనని ఫైర్ అయ్యారు. విజయ్ కార్నర్ మీటింగ్ (Corner Meeting)కు భారీగా జనం రావడమే గందరగోళానికి కారణమైందని అన్నారు. తాము 20 వేల మంది వస్తారని అంచనా వేశామని, అంతకు మించి జనమే వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.






