ఒక ఎమ్మెల్యే బీర్లు కొడుతూ, మరొకరు త‌ల్వార్ తిప్పుతూ.. వామ్మో తమిళనాడు ఫ్యూచర్ ఏంటో?

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న టీవీకేలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేల ప‌రిస్థితి అలానే క‌నిపిస్తోంది. గెలిచిన త‌ర‌వాత ఒక‌రు ఏకంగా బ‌హిరంగ ప్ర‌దేశంలో బీర్లు తాగుతూ ఫ్రెండ్స్ తో చిల్ అవుతుంటే మ‌రొక‌రు త‌ల్వార్ తో కేక్ క‌టింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఒక ఎమ్మెల్యే బీర్లు కొడుతూ, మరొకరు త‌ల్వార్ తిప్పుతూ.. వామ్మో తమిళనాడు ఫ్యూచర్ ఏంటో?
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఎన్నిక‌ల ముందు ఒక‌లా ఎన్నిక‌ల త‌ర‌వాత మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తారు. ఎన్నిక‌ల ముందు ఏం తెలియ‌న‌ట్టుగా, ప్ర‌జాసేవ కోసమే పుట్టిన‌ట్టుగా ఉంటారు. కానీ ఓసారి ఎన్నిక‌లు పూర్తై విజ‌యం సాధించారంటే చాలు అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇప్పుడు త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న టీవీకేలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేల ప‌రిస్థితి అలానే క‌నిపిస్తోంది. గెలిచిన త‌ర‌వాత ఒక‌రు ఏకంగా బ‌హిరంగ ప్ర‌దేశంలో బీర్లు తాగుతూ ఫ్రెండ్స్ తో చిల్ అవుతుంటే మ‌రొక‌రు త‌ల్వార్ తో కేక్ క‌టింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

టీవీకే త‌ర‌పున పోటీ చేసి గెలిచిన తంజావూర్ ఎమ్మెల్యే విజ‌య్ శ‌ర్వ‌ణ‌న్ త‌న మిత్రుల‌తో క‌లిసి బీర్లు తాగుతూ రోడ్డుపై స్టెప్పులు వేశారు. ఆయ‌న‌ను ఆపే ప్ర‌య‌త్నం చేసినా ఆగ‌కుండా మ‌ద్యం మ‌త్తులో తూలుతూ డ్యాన్స్ చేశారు. ఈయ‌న కేవ‌లం 10వ త‌ర‌గతి చ‌దువుకోగా ఈయ‌న‌పై ఓ క్రిమిన‌ల్ కేసు కూడా ఉంది. ఇక మ‌రో రోయాపురం ఎమ్మెల్యే లోయోలమ‌ణి గెలిచిన ఆనందంతో త‌న స‌న్నిహితులు, అనుచ‌రుల మ‌ధ్య తల్వార్ తో కేక్ క‌టింగ్ చేశారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

దీంతో నెటిజ‌న్లు, డీఎంకే మ‌రియు బీజేపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌ను గెలిపించారు త‌మిళ‌నాడు ప‌రిస్థితి ఏంటో అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌జావూర్ ఎమ్మెల్యే విజ‌య్ శ‌ర్వ‌ణ‌న్ గెల‌వ‌క‌ముందు పోలింగ్ బూత్ వ‌ద్ద ఓట్ల కోసం అమాయ‌కంగా నిలుచున్న వీడియోను ఇప్పుడు బీర్లు కొడుతూ చిల్ అవుతున్న వీడియోల‌ను క‌లిపి గెల‌వ‌క‌ముందు ఒక‌లా గెలిచిన త‌ర‌వాత మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇక త‌మిళ‌నాడులో గెలిచినా ఇంకా విజ‌య్ అధికారం చేప‌ట్ట‌లేదు. ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌క‌ముందే ఎమ్మెల్యేలు ఇలా రెచ్చిపోతే చేసిన త‌ర‌వాత ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు.

Next Story