- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చోటు దక్కేనా?: క్లారిటీ ఇచ్చిన టీవీకే
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విజయ్.. మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో AIADMK ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటిచ్చే అంశంపై టీవీకే క్లారిటీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విజయ్.. మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం దక్కుతుందో లేదోనని సందిగ్ధత నెలకొనగా.. దానిపై టీవీకే అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది. AIADMK రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం ఇస్తే.. టీవీకేకు తాము మద్దతిచ్చే అంశాన్ని పునః సమీక్షించుకుంటామని కూటమి భాగస్వామ్య పక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ బహిరంగంగానే ఈ హెచ్చరిక చేశారు.
కూటమి పక్షాల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ముఖ్యమంత్రి విజయ్ రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలు చేపట్టారు. తిరుగుబాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఎలాంటి మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన లేదని, వారిని కేబినెట్‌లోకి తీసుకోబోమని టీవీకే అధినాయకత్వం తన కూటమి భాగస్వాములకు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని వీసీకే నేత తిరుమావళవన్ ధృవీకరిస్తూ.. అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని టీవీకే నుండి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. మరోవైపు సీపీఐ(ఎం) కూడా అన్నాడీఎంకే అసమ్మతి నేతలతో అధికార మార్పిడిని అధికారికంగా పంచుకోవడంపై తన రిజర్వేషన్లను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ రాజకీయ సందిగ్ధతకు తెరపడటంతో అతి త్వరలోనే భారీ స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగబోతోందని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి బహిరంగ సభలో విజయ్ ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు పాలనలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. 1967 తర్వాత తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా 'అధికార భాగస్వామ్యం' చూడబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కోసం నిలబడే పార్టీలను మంత్రివర్గంలో చేర్చుకోవాలని సీఎం విజయ్ భావిస్తున్నారని, అందులో భాగంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కేబినెట్‌లో చేరాలని సీఎం పట్టుబడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. వామపక్షాలు ప్రభుత్వం బయటి నుండి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోగా.. వీసీకే, ఐయూఎంఎల్ (IUML) పార్టీలను కూడా మంత్రివర్గంలో చేరాలని టీవీకే ఆహ్వానించింది.






