- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉండాలి.. టీవీకే చీఫ్ విజయ్ కీలక ప్రటకన
టీవీకే పార్టీ(TVK Party) అధినేత, ప్రముఖ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) తన పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: టీవీకే పార్టీ(TVK Party) అధినేత, ప్రముఖ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) తన పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఆదివారం తమిళనాడులోని కాంచిపురం జిల్లా మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ సొంత ఇళ్లు ఉండాలనేదే టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక బైక్ ఉండాలని పేర్కొన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతిభద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభలు, సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఇవాళ నిర్వహఇంచిన సమావేశానికి కూడా రెండు వేల మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. క్యూ ఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సమావేశం హాల్‌లోకి అనుమతి ఇచ్చారు.






