టీవీకే చీఫ్ విజయ్ ఆస్తులు రూ.520 కోట్లు.. ఎన్నికల అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-30 13:39:24  IST  )

తమిళనాడు ఎన్నికల్లో పోటీలోకి దిగుతున్న వేళ టీవీకే అధినేత విజయ్ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో బహిర్గతం చేశారు.

టీవీకే చీఫ్ విజయ్ ఆస్తులు రూ.520 కోట్లు.. ఎన్నికల అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎన్నికల వేళ తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు తలపతి విజయ్ (Thalapathy Vijay) తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారిగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ (Affidavit) ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 520 కోట్లుగా ఉంది. అయితే, విజయ్ తన అఫిడవిట్‌లో చర, స్థిరాస్తుల వివరాలను విడివిడిగా పొందుపరిచారు. సుమారు రూ.405 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో నగదు, బ్యాంక్ డిపాజిట్లు, విలువైన వాహనాలు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఇక సుమారు రూ.115 కోట్ల విలువైన స్థిరాస్తులు ఇళ్లు, భవనాలు, భూములు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు.

భార్య పేరిట భారీగా బ్యాంక్‌‌లలో డిపాజిట్లు..

తన భార్య సంగీత (Sangeetha) పేరిట ఉన్న బ్యాంకు డిపాజిట్ల వివరాలను కూడా విజయ్ ఈ అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె పేరిట ఇండియన్ బ్యాంక్‌లో రూ.25 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)‌లో రూ.40 కోట్లు, హెడీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో రూ.20 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. మొత్తంగా విజయ్ సతీమణి సంగీత పేరు మీద కేవలం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే రూ.85 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరైన విజయ్ పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన వేళ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడం సర్వ్రతా చర్చనీయాశంగా మారింది.

Next Story