మేం వేసిన పిటిషన్ వల్లే వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేటస్ కో విధించింది: విజయ్

by Ajay Maddhiboyina |

వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. మే 5వ తేదీ వరకు కేసును వాయిదా వేస్తూ,

మేం వేసిన పిటిషన్ వల్లే వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేటస్ కో విధించింది: విజయ్
X

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. మే 5వ తేదీ వరకు కేసును వాయిదా వేస్తూ, అప్పటి వరకు చట్టంపై యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ కౌన్సిల్‌లో కూడా అప్పటి వరకు ముస్లీమేతరులను సభ్యులుగా నియమంచివద్దని స్పష్టం చేసింది. కాగా సుప్రీం తీర్పుపై స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి సోషల్ మీడియాలో స్పందించారు. వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా తాము వేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పునిచ్చిందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ధ‌ర్మాస‌నం నిర్ణ‌యం వ‌ల్ల‌నే కేంద్రం బిల్లులోని రాజ్యాంగ విరుద్ధ‌మైన కీల‌క నిబంధ‌న‌ల‌పై, వక్ఫ్ బోర్డుల్లో ముస్లీమేత‌రుల‌ను చేర్చ‌కుండా మరియు వ‌క్ఫ్ ఆస్తుల‌ను డీనోటిఫై చేయ‌కుండా ఉంద‌ని తెలిపారు. రాజ్యాంగ విరుద్ద‌మైన ఫాసిస్ట్ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా టీవీకే త‌ర‌ఫున వాదించినందుకు కాంగ్రెస్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ఎల్ల‌ప్పుడూ మైనార్జీలు, అన‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం పోరాడ‌తాన‌ని స్ప‌ష్టంగా చెప్పాల‌నుకుంట‌న్నట్టు తెలిపారు. టీవీకే వారికి ఎప్పుడూ అండంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story