- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Turkish Warship : కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... పాక్ కు అండగా తుర్కియే!
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకొని.. యుద్ధానికి రెడీ అయ్యాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తన మిత్ర దేశాల సహకారం కోరుతోంది. ఈ అనుమాలను బలపరుస్తూ తుర్కియే(Turkey)కు చెందిన ఓ భారీ యుద్ధ నౌక(WarShip) పాకిస్తాన్ చేరుకోవడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. 'టీసీజీ బుయూకడ'(TCG Buyukada) అనే యుద్ధనౌక నేడు కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గములకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. స్టెల్త్ టెక్నాలజీతో, 99 మీటర్ల పొడవు, 2,400 టన్నుల బరువు, 29 నాట్ల వేగంతో, మిసైళ్లు, యాంటీ-సబ్‌మెరీన్ ఆయుధాలతో శత్రు నౌకలు, జలాంతర్గాములను ధీటుగా ఎదుర్కోగలదు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఏ క్షణాన అయిన తమపై దాడి చేయవచ్చుననే అనుమానంతో పాక్ అప్రమత్తంగా వ్యహరిస్తోంది. అందులో భాగంగానే తుర్కియే నుంచి భారీ యుద్ధ నౌకలు, డ్రోన్లు, సైనిక విమానాలను సహాయంగా పొందింది. కాగా ఇదివరకు జరిగిన భారత్-పాక్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ సముద్రమార్గం గుండా దాడి చేసే అవకాశాలు కూడా అధికంగా ఉండటంతో పాక్ ఈ గస్తీ నౌకను తుర్కియే నుంచి తెప్పించుకున్నట్టు సమాచారం.






