- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > రెండు రోజుల్లో భారీ సునామీ.. దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది.. కాలజ్ఞానం నిజం కాబోతుందా..?
రెండు రోజుల్లో భారీ సునామీ.. దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది.. కాలజ్ఞానం నిజం కాబోతుందా..?
by Sujitha Rachapalli |
జపాన్‌ను భూకంపాలు వణికిస్తున్నాయి. పది రోజుల్లో దాదాపు 900 సార్లు భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌ను భూకంపాలు వణికిస్తున్నాయి. పది రోజుల్లో దాదాపు 900 సార్లు భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. రాత్రిపూట కూడా మేల్కొని ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబా వంగా చెప్పినట్లుగా ఏదో కీడు సంభవించబోతుందనే ప్రచారం జరుగుతోంది. జూలై 5న ఈ దేశంలో భారీ సునామీ వస్తుందని.. లక్షల్లో మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు బాబా వంగా. తన పుస్తకం ‘ ది ఫ్యూచర్ ఐ సా’లో ఈ విషయాన్ని వివరించారు. జపాన్ - ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో భారీ ప్రకంపనలు చెలరేగుతాయని.. దీని కారణంగా జపాన్ దేశం మ్యాప్‌లో లేకుండా పోతుందని రాసుకొచ్చారు.
Next Story






