- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMF: ట్రంప్ వాణిజ్య యుద్ధం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్ కంటే కఠినమైన పరీక్ష: ఐఎంఎఫ్
టారిఫ్ ప్రభావం ఊహించని షాక్‌లను సృష్టిస్తోంది, దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్ణయాలను సంక్లిష్టం చేస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఐదేళ్ల నాటి కోవిడ్-19 సంక్షోభం కంటే మరింత కఠినమైన సవాలుగా ఉంటుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్.. 2020 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం, ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించడం ద్వారా ఐక్యతను ప్రదర్శించాయి. ప్రస్తుత వాతావరణం కూడా అప్పటి పరిస్థితినే ప్రతిబింబిస్తోంది. టారిఫ్ ప్రభావం ఊహించని షాక్‌లను సృష్టిస్తోంది, దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో విధాన నిర్ణయాలను సంక్లిష్టం చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలతో పాటు ప్రపంచ మార్కెట్లపై టారిఫ్ ప్రభావం పడి, సెంట్రల్ బ్యాంకులు వృద్ధికి మద్దతిచ్చేందుకు సవాళ్లను ఎదుర్కొనక తప్పదని ఆమె వివరించారు. కొవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు పాలసీ విధానాలను త్వరితగతిన సడలించాయి. కానీ ఈసారి టారిఫ్ మరింత క్లిష్టంగా ఉంటుందన్నారు.
టారిఫ్ వల్ల ద్రవ్యోల్బణం పెరగదనే స్పష్టత వచ్చే వరకు వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధంగా లేమని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిస్తోంది. కానీ అమెరికాతో అధిక వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు, ఈ పరిస్థితి 'షాక్ లాగా' కనిపిస్తోంది. దానర్థం ద్రవ్యోల్బణం, వృద్ధి మందగిస్తుందని గమనించాలి. ధనిక, మధ్య-ఆదాయ దేశాలలో వృద్ధిని పునరుద్ధరించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం లేదా బాండ్-కొనుగోలును ప్రకటించినప్పటి కంటే పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రకమైన వ్యత్యాసం ఉన్నప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారుతాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఈ మార్పుల కారణంగా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటాయని గోపీనాథ్ అన్నారు.






