TRUMPH : మాకు 50% వాటా కావలె..!

by M.Rajitha |   ( Updated:2025-01-19 17:20:07.0  )
TRUMPH : మాకు 50% వాటా కావలె..!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో ఇటీవల టిక్ టాక్(Tik Tok) పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యాన్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trumph) సంచలన ప్రకటన విడుదల చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50% వాటా పొందేందుకు అనుమతి ఇస్తేనే టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేస్తామని వెల్లడించారు. కాగా ఈ యాప్ ద్వారా తమ దేశ పౌరుల డాటా చైనా ప్రభుత్వానికి చేరుతోందనే అనుమానం వ్యక్తం ఇటీవల అమెరికా సుప్రీంకోర్ట్ టిక్ టాక్ పై బ్యాన్ విధించింది. కాగా మరి కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించబోతున్న ట్రంప్ నుంచి ఈ ప్రకటన సంచలనం రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story