America: ట్రంప్ మరో కొత్త రూల్.. అవన్నీ ఎల్లప్పుడూ క్యారీ చేయాల్సిందే!

by Yella Dhawani Reddy |

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donarld Trump) రోజుకో కొత్త రూల్‌తో విదేశీయులకు చెమటలు పట్టిస్తోన్నారు.

America: ట్రంప్ మరో కొత్త రూల్.. అవన్నీ ఎల్లప్పుడూ క్యారీ చేయాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donarld Trump) రోజుకో కొత్త రూల్‌తో విదేశీయులకు చెమటలు పట్టిస్తోన్నారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నియమాలు అమలు చేస్తుండగా.. తాజాగా మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కొత్త యూఎస్ ఇమ్మిగ్రేషన్ రూల్ ప్రకారం .. అక్కడ నివసించే విదేశీయులు (Foreigners) తప్పనిసరిగా తమ వెంట ఐడీ కార్డులు ఉంచుకోవాలని ఆదేశించారు. స్టడీ, ట్రావెల్, H1B, గ్రీన్ కార్డు సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా నిరంతరం గుర్తింపు కార్డులు వెంట పెట్టుకోవాలని సూచించారు. అలాగే, వారి పిల్లల వయస్సు 14 ఏళ్లు నిండిన వెంటనే వారి వేలిముద్రలు సమర్పించి, రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అక్రమ వలసదారుల ఏరివేత టార్గెట్‌గా ఈ మేరకు ట్రంప్​ సర్కార్​ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Next Story