లొంగిపోయేందుకు ఇరాన్ రెడీ.. ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling
X

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధమైందని అన్నారు. ఈ విషయాన్ని రెండ్రోజుల క్రితం జీ7 నేతలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఎట్టకేలకు ఇరాన్ భయపడిందని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆచూకీపైనా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మొజ్తబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నారని చెప్పారు. కానీ అతడికి తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే..?

ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌లోని కాంపౌండ్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో మోజ్తాబా తండ్రి, అప్పటి సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. ఫాక్స్ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "అతడు బహుశా బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కానీ అతడికి చాలా నష్టం జరిగింది" అని వ్యాఖ్యానించారు.

Next Story