ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. టూరిస్టుల సోషల్ మీడియా చెక్!

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇకపై టూరిస్టులపైనా కఠిన నిఘా పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. టూరిస్టుల సోషల్ మీడియా చెక్!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇకపై టూరిస్టులపైనా కఠిన నిఘా పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. విదేశీ వలసలను నియంత్రించేందుకు టూరిస్టుల సోషల్ మీడియా చెక్ చేయనుందని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. అమెరికా వెళ్లాలనుకునే పర్యాటకులు, వారు వీసా అవసరం లేని దేశాల వారైనా సరే గత ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీని తప్పనిసరిగా సమర్పించాల్సి రావచ్చునని అంటున్నారు.

ఈ ప్రతిపాదనలపై అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) పబ్లిక్ నోటీసు జారీ చేసి, 60 రోజుల్లో ప్రజల అభిప్రాయాలు పంపాలని కోరింది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలు, గత పదేళ్ల ఈమెయిళ్లు, ఐదేళ్ల ఫోన్ నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు వంటి భారీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సిన అవకాశముందని సూచించింది. అంతేకాదు స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా సెల్ఫీలను అప్‌లోడ్ చేయాల్సి రావచ్చని కూడా నోటీసులో పేర్కొంది.

Next Story