- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump : జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Ukrainian President Zelensky)కి వరుస షాక్(Shocks) లతో పరేషాన్ చేస్తున్నారు. తాజాగా కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Ukrainian President Zelensky)కి వరుస షాక్(Shocks) లతో పరేషాన్ చేస్తున్నారు. తాజాగా కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin) తో ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ మరో బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు సన్నగిల్లాయి. ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని ట్రంప్ తెలిపారు. ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ వెల్లడించారు. తేదీలు ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు. వీలైనంత త్వరగా చర్చల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ట్రంప్ రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇక ట్రంప్ తో ఫోన్ కాల్ చర్చలపై జెలెన్ స్కీ స్పందిస్తూ.. కీవ్ లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మా సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయని...స్వయంగా ట్రంప్ తాను పుతిన్ తో మాట్లాడినట్లు వెల్లడించారని తెలిపారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను" అని జెలెన్ స్కీ టెలిగ్రామ్ ఛానెల్ లో పేర్కొన్నారు.






