H-1B Visa: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..హెచ్-1బీ వీసాలో కీలక మార్పులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-29 15:07:28  IST  )

అమెరికాలోని (USA) డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

H-1B Visa: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..హెచ్-1బీ వీసాలో కీలక మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని (USA) డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసా (H-1B visa) ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే(FLAG) వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది. అలాగే, ఈ వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అమలు చేయనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు వెల్లడించింది.

ఇక తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను అధికారులు సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించి ఐదేళ్ల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హెచ్‌-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌, శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్‌ అఫ్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.

పాత వ్యవస్థలో ఒకే వ్యక్తి కోసం బహుళ దరఖాస్తులను సమర్పించేందుకు వీలు ఉండేది. కొత్త వ్యవస్థలో దీన్ని తొలగించనున్నారు. అలాగే, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది ప్రతి ఎంట్రీకి 10 నుంచి 215 డాలర్ల వరకు ఉండనుంది. కాగా, ప్రతి ఏడాది అమెరికా 85 వేల H-1B వీసాలను జారీ చేస్తుండగా.. అందులో 70 శాతం భారతీయులే ఉన్నట్లు పేర్కొంది.

Next Story