- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతి ఒప్పందం చేసుకో.. లేదంటే మేం వెళ్లిపోతాం
మీరు ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాకు వెళ్లి మా అపోజిషన్ పార్టీ వాళ్ల కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాను రక్షించే అధ్యక్షుడు వచ్చాడు. మీకు ఈ విషయంలో అభినందించాలని జేడీ వాన్స్ ఘాటిగా చెప్పారు.

- ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి
- ఎవరికీ తలవంచమని చెప్పిన జెలెన్‌స్కీ
- మీడియా ఎదుటే ఇరువురు నేతల వాగ్వాదం
దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఇరువురు దేశాధినేతలు వాగ్వివాదానికి దిగారు. జెలెన్‌స్కీ వెంటనే రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ గట్టిగా చెప్పారు. లేకపోతే తాము ఈ శాంతి చర్చల నుంచి వైదొలగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో ఉందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని అన్నారు. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. మీ వల్ల మూడు ప్రపంచ యుద్దం వచ్చేలా ఉంది. మీ దగ్గర ఎలాంటి కార్డ్స్ లేవు. జూదం ఆడటం ఆపేయండి అని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ట్రంప్ మాటలకు జెలెన్‌స్కీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. మేం మా దేశంలో ఉంటున్నాం. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో మాతో ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ జెలెన్‌స్కీ చెప్పారు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ గట్టిగా అరుస్తూ మాట్లాడుతుండటంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్నారు. ట్రంప్‌తో గట్టిగా మాట్లాడవద్దని సూచించారు. రెండు దేశాల మధ్య యుద్దానికి ముగింపు పలకాలంటే దౌత్యం ముఖ్యమని చెప్పారు. అయితే జెలెన్‌స్కీ ఏ మాత్రం పట్టించుకోకుండా కౌంటర్లు ఇస్తుండటంతో జేడీ వాన్స్ కూడా అసహనానికి గురయ్యారు. మీరు మీ ప్రజల తరపున ఇక్కడకు వచ్చారు. కానీ ఓవల్ ఆఫీసుకు వచ్చి ఇక్కడి పరిపాలనపై దాడి చేస్తూ.. మీ దేశంలోని వినాశనాన్ని ఆపాలని కోరడం ఎంత వరకు న్యాయం అని వాన్స్ ప్రశ్నించారు. మీరు ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాకు వెళ్లి మా అపోజిషన్ పార్టీ వాళ్ల కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాను రక్షించే అధ్యక్షుడు వచ్చాడు. మీకు ఈ విషయంలో అభినందించాలని జేడీ వాన్స్ ఘాటిగా చెప్పారు.






