మస్క్‌కు ట్రంప్ వార్నింగ్.. దుకాణం సర్ధుకుని సౌతాఫ్రికా వెళ్లిపోతావు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-01 07:14:09  IST  )

'బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill)' విషయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

మస్క్‌కు ట్రంప్ వార్నింగ్.. దుకాణం సర్ధుకుని సౌతాఫ్రికా వెళ్లిపోతావు!
X

దిశ, వెబ్ డెస్క్: 'బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill)' విషయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ బిల్లు ఆమోదిస్తే వెంటనే కొత్త పార్టీ పెడుతానని ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, మస్క్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా చరిత్రలో ఎవరూ పొందనంత భారీగా ప్రభుత్వ సబ్సిడీలు తీసుకున్న వ్యక్తి మస్క్‌ అని, ప్రభుత్వ సబ్సిడీలు నిలిపివేస్తే మస్క్ తిరిగి తన స్వస్థలమైన సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ఎలాన్ మస్క్ ఒకసారి తన పాత లెక్కలు చూసుకోవాలి. అమెరికా ప్రభుత్వం నుంచి ఎవరూ పొందనంత భారీగా సబ్సిడీలు ఆయన పొందారు. అదే మస్క్‌ నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్‌గా పనిచేశారు. కానీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దిగుతున్నారు. ఆయన్ను దేశం విడిచి సౌతాఫ్రికా వెళ్లిపోవాలని సూచించాల్సిన స్థితి వచ్చింది' అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాకెట్ లాంచ్ లకు, శాటిలైట్లకు, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సబ్సిడీలు ఉండవన్నారు. ఇది అమెరికా సంపదను కాపాడుతుందని, రానున్న కాలంలో డోజీ విటిపై దృష్టిపెట్టి భారీగా డబ్బును ఆదా చేస్తుందని అన్నారు.

కాగా, ట్రంప్‌ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్‌ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక వీరి విబేధాలు అమెరికా రాజకీయాల్లో రసవత్తరమైన పరిణామాలకు తెరతీయనున్నాయి.

Next Story