'డీల్ కుదరకపోతే యుద్ధమే'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

డీల్ కుదరకపోతే యుద్ధమే.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో చర్చలు సఫలం కాకపోతే యుద్ధం తప్పదని, తాము ఇప్పటికే ఆయుధాలను సిద్ధం చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం తాము ప్రతిపాదించే 'డీల్'ను అంగీకరించాలని, లేనిపక్షంలో వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్‌తో డీల్ కుదరకపోతే మేము మరోసారి యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. గత కాల్పుల విరమణ సమయంలో మేము మా శక్తిని మరింతగా కూడగట్టుకున్నాం. ఇప్పటికే అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలను యుద్ధం కోసం సిద్ధం చేశాం అని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన గొప్ప విజయమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కాదని, పటిష్టమైన ఒప్పందం (డీల్) లేకుండా దీనిని కొనసాగించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కోసం మేము ఒక అద్భుతమైన డీల్ సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా శాంతి, భద్రత, రక్షణ ఏర్పడతాయి. నేను రూపొందించిన ఈ ఒప్పందాన్ని చూసి యావత్ ప్రపంచమే గర్వపడుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఇంధన మార్కెట్లో కలకలం మొదలైంది. అమెరికా తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story