- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ముందే మాతో డీల్ చేసుకోండి..' : క్యూబాకు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్యూబాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్యూబాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత పరిస్థితులు మారాయని పేర్కొన్న ట్రంప్.. ఇకపై వెనిజువెలా నుంచి క్యూబాకు ఆయిల్, డబ్బు వెళ్లకుండా పూర్తిగా కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా ముందే అమెరికాతో ఒప్పందం చేసుకోవడం మంచిదని హెచ్చరించారు. ఇప్పటివరకు వెనిజువెలా నుంచి క్యూబాకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా అవుతుండగా.. మదురో అరెస్ట్ తర్వాత అమెరికా ఆ ఆయిల్‌ను తన దేశానికి మళ్లిస్తోంది. దీనివల్ల క్యూబా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
కాగా ట్రంప్ వ్యాఖ్యలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్-కానెల్ ఘాటుగా స్పందిస్తూ.. క్యూబా ఒక స్వతంత్ర దేశమని, ఎవరూ తమకు ఆదేశాలు ఇవ్వలేరని అన్నారు. దశాబ్దాలుగా అమెరికా తమను అణగదొక్కాలని చూస్తోందని విమర్శించారు. ఈ తాజా పరిణామాలు అమెరికా–క్యూబా మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.






