Trump: యుద్ధం ఆపకపోతే ట్రేడ్ డీల్ జరగదని హెచ్చరించా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

భారత్ పాక్ ఘర్షణపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ లో ఐదు జెట్లు కూలిపోయాయని తెలిపారు.

Trump: యుద్ధం ఆపకపోతే ట్రేడ్ డీల్ జరగదని హెచ్చరించా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) సమయంలో ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని లేదంటే అణుయుద్ధం జరిగేదని తెలిపారు. వార్ ఆపకుంటే ట్రేడ్ డీల్ ఉండబోదని హెచ్చరించానని, దీంతో రెండు దేశాలు దిగొచ్చాయన్నారు. వైట్ హౌస్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. రెండు దేశాల మధ్య వివాదం తీవ్రంగా మారడంతో అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. యుద్ధం ఆపకపోతే ఫలితం మరోలా ఉండేదన్నారు. మేము గత మూడు నెలల్లోనే భారత్ పాకిస్థాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య యుద్ధాలను ఆపామని తెలిపారు. కాగా, ట్రంప్ గతంలోనే ఇలాంటి వాదనలే చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై ప్రధాని స్పందించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నాయి.

Next Story