- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: సంపన్న వలసదారులకు ట్రంప్ వల.. పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్ ప్రవేశపెట్టే యోచన !
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేవారికి పౌరసత్వం కల్పించేందుకు గోల్డ్ కార్డ్ (Gold card) వీసాలను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. 35 ఏళ్ల నుంచి అందుబాటులో ఉన్న ఈబీ-5 (EB-5) వీసా స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ వీసా కార్డు అమెరికన్ పౌరసత్వానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. గోల్డ్ కార్డ్ ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులు థనవంతులయ్యే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. ఒక మిలియన్ కార్డులు అమ్ముడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్టబడిదారులు ధనవంతులు కావడంతో పాటు యూఎస్‌లో పన్నులు చెల్లిస్తారని అంతేగాక. ప్రజలకు ఉపాధి సైతం పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రణాళిక విజయవంతం అవతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు వీసా కార్యక్రమానికి సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు. రెండు వారాల్లో ఈబీ-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard lutnik) తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కొత్త వీసా కార్యక్రమం దేశంలో పెట్టుబడులను పెంచుతుందని, అంతేగాక ఈబీ-5 సంబంధిత మోసాలను ఆరికట్టడానికి సహాయ పడుతుందని తెలిపారు. ట్రంప్ ప్రణాళిక సరైందేనని తెలిపారు.
కాగా, ఈబీ-5 వీసా అనేది ఒక అమెరికన్ కంపెనీలో దాదాపు ఒక మిలియన్ పెట్టుబడి పెట్టి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించే వారికి ఉద్దేశించబడింది. దీనిని 1990లో యూఎస్ ఆమోదించింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ప్రస్తుతం గోల్డ్ కార్డ్ దీనిని భర్తీ చేయనుంది. అయితే గోల్డ్ కార్డ్ అమలులోకి వస్తే, గ్రీన్ కార్డ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ నిపుణుల సమస్యలు మరింత పెరుగనున్నట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.






