Trump: వాణిజ్య యుద్ధం మళ్లీ షురూ.. కెనడా ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకం

by B.Srinivas |   (  Updated:2025-07-11 12:58:10  IST  )

కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 35 శాతం సుంకాన్ని ప్రకటించింది.

Trump: వాణిజ్య యుద్ధం మళ్లీ షురూ.. కెనడా ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకం
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 35 శాతం సుంకాన్ని ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark carney)కి లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగస్టు 1 నుంచి అమెరికాలోకి ప్రవేశించే కెనడియన్ ఉత్పత్తులపై ఈ సుంకం వర్తించనుంది. కెనడా ప్రతీకార చర్య, కొనసాగుతున్న వాణిజ్య అడ్డంకులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. కెనడా ప్రతీకార సుంకాలు విధిస్తే దీనిని మరింత పెంచుతామని హెచ్చరించారు. ఏదైనా కారణం చేత ప్రతీకార చర్యలు తీసుకుంటే 35 శాతానికి అదనంగా సుంకం వేస్తామని తెలిపారు.

కెనడా వాణిజ్య విధానాలు, ఫెంటానిల్ రవాణా అమెరికాను బాధించే అనేక తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయని, వాటిలో స్థిరమైన వాణిజ్య లోటు కూడా ఉందని స్పష్టం చేశారు. కెనడా యూఎస్ పాడి రైతులపై 400 శాతం వరకు అధిక సుంకాలను విధిస్తుందని గుర్తు చేశారు. కాగా, అమెరికా ఇప్పటికే ఏ ఏడాది మార్చిలో కెనడాపై 25 శాతం సుంకాన్ని విధించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య దశాబ్దాల నాటి వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ మరోసారి సుంకాలను ప్రకటించడం గమనార్హం. అయితే దీనిపై కెనడా ఇంకా స్పందించలేదు.

Next Story