అమెరికాకు అసాధారణమైన ప్రమాదం అంటూ.. క్యూబాపై ట్రంప్ కన్నెర్ర

by Phanindra |

అమెరికాకు అసాధారణమైన ప్రమాదం అంటూ క్యూబాపై ట్రంప్ కన్నెర్ర చేశారు. ఆ దేశానికి ఆయిల్ పంపితే భారీ సుంకాలు వేస్తానన్నారు.

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling
X

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling

దిశ, నేషనల్ బ్యూరో: మరో లాటిన్ అమెరికా దేశంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశారు. క్యూబాపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఆయన ప్రభుత్వం.. మదురోను బంధించిన తర్వాత వెనిజులా నుంచి ఆ దేశానికి వెళ్లే చమురు సరఫరాను కూడా నిలిపివేసింది. తాజాగా క్యూబాకు ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాలపై భారీగా సుంకాలు వేస్తానంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రతకు క్యూబా చాలా పెద్ద ప్రమాదమని ఈ ఆర్డర్స్‌లో యూఎస్ ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అమెరికా శత్రువులైన చైనా, రష్యా, ఇరాన్, హమాస్, హెజ్బొల్లా వంటి గ్రూపులకు క్యూబా మద్దతిస్తోందని, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తోందని ఆరోపించింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్.. ఇది దారుణమైన దురాక్రమణ చర్య అని, దీనికోసం తాము అమెరికాకు ప్రమాదమనే అబద్ధాలు వల్లె వేస్తున్నారని ట్రంప్ సర్కారుపై మండిపడ్డారు.

Next Story