- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nuclear Weapons: న్యూక్లియర్ వెపన్స్ ని పూర్తిగా మర్చిపోవాలి

దిశ, నేషనల్ బ్యూరో: న్యూక్లియర్ డీల్(Nuclear Deal) విషయంలో అమెరికాకు ఇరాన్(Iran-US) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాలని లేకపోతే ఆ దేశంలోని అణు స్థావరాలపై సైనిక చర్యలకు దిగుతామని బెదిరించారు. ‘ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని పూర్తిగా మరిచిపోవాలి. లేదంటే ఆ దేశంలోని అణు స్థావరాలపై సైనిక చర్యకు దిగుతా. న్యూక్లియర్ డీల్ విషయంలో మేం వారితో మంచిగానే ఉన్నాం. అయితే, ఆ దేశం కావాలనే ఈ ఒప్పందంపై అభిప్రాయం వ్యక్తం చేయట్లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తమను మోసం చేస్తున్నట్లు కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, న్యూక్లియర్ డీల్‌పై ఇటీవలే ఒమన్‌లో తొలివిడత చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన చర్చలు ఈ శనివారం రోమ్‌లో జరగనున్నాయి.
ఒమన్ లో చర్చలు..
న్యూక్లియర్ డీప్ పై ఒమన్‌లో జరిగిన తొలివిడత చర్చలు సజావుగా సాగాయని ఇరాన్‌కు చెందిన మీడియా పేర్కొంది. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు పాల్గొన్నారు. ఈ విషయంపై మరోసారి సమావేశమవుతామని అరాగ్చీ అన్నారు. ఈ పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. అందులోభాగంగానే ఈ శనివారం మరోసారి సమావేశం కానున్నాయి. ఇకపోతే, గతంలోనూ ట్రంప్ హయాంలో ఇరాన్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ట్రంప్ పాలన సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య పరోక్ష చర్చలు విఫలమయ్యాయి.