- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ ‘ట్యాక్స్ బిల్లు’కు సెనేట్ ఆమోదం.. మార్పుల తర్వాత మరోసారి ఓటింగ్?
ట్రంప్ ‘ట్యాక్స్ బిల్లు’కు సెనేట్ ఆమోదం తెలిపింది. మరికొన్ని సంస్కరణల తర్వాత మరోసారి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు యూఎస్ సెనేట్ ఆమోదం లభించింది. మూడు గంటలపాటు ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో చివరకు 51-49 తేడాతో బిల్లు పాసైంది. బిల్లును పాస్ చేయించేందుకు క్యాపిటోల్‌లోనే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. పలువురు రిపబ్లికన్ అభ్యర్థులతో సుదీర్ఘ చర్చలు జరిపి, వారిని ఒప్పించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇద్దరు రిపబ్లికన్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఈ బిల్లుపై సెనేట్‌లో చర్చించేందుకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఏమైనా సవరణలు ఉంటే చేసేసి, ఈ బిల్లుపై త్వరలోనే మరోసారి ఓటింగ్ పెడతారు. అప్పుడు బిల్లుకు ఆమోదం లభిస్తే.. చివరగా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు దాన్ని పంపుతారు. అక్కడ కూడా పాసైతే ట్రంప్ సంతకం కోసం బిల్లును వైట్‌హౌస్‌కు పంపుతుంది.
Next Story






