ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ట్రంప్.. బ్రాండెడ్ డ్రగ్స్‌పై 100 శాతం సుంకాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-26 01:52:31  IST  )

ప్రపంచంలోని ఆయా దేశాలపై ప్రతికార సుంకాలతో రెచ్చిపోతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బిగ్ షాకిచ్చాడు.

ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ట్రంప్.. బ్రాండెడ్ డ్రగ్స్‌పై 100 శాతం సుంకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని ఆయా దేశాలపై ప్రతికార సుంకాలతో రెచ్చిపోతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బిగ్ షాకిచ్చాడు. ఇక నుంచి బ్రాండెడ్ డ్రగ్స్‌, ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించనున్నట్లుగా ప్రకటించాడు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు ఉంటాయని తెలిపారు. బ్రాండెడ్‌ లేదా పేటెంటెడ్‌ డ్రగ్స్‌పై ఏకంగా 100 శాతం విధిస్తామని తేల్చి చెప్పారు. అయితే, అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు మాత్రం ఈ సుంకాలు మాత్రం వర్తించబోవని తెలిపారు. తాజాగా ప్రకటించిన నిర్ణయాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.

Next Story