- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ఫార్మాకు ట్రంప్ షాక్.. కుప్పకూలిన భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు
అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై 100% టారిఫ్ విధించేందుకు ట్రంప్ సిద్ధం.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు షాక్‍ల మీద షాక్‍లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ తో యుద్ధం విషయంలో తికమక మాటలు మాట్లాడుతున్న ట్రంప్ తాజాగా భారతీయ ఫార్మా రంగంపై కొరడా ఝుళిపించబోతున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే కొన్ని రకాల ఔషధాలపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధించేలే యోచనలో అమెరికా ఉందని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ వార్త బయటకు రావడంతో భారత స్టాక్ మార్కెట్‌లో సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.
గతంలోనే ట్రంప్ హెచ్చరిక:
ఇండియన్ సంస్థలకు శరాఘాతం:
టారిఫ్‍ల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఫార్మా కంపెనీల ఆదాయంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ట్రేడింగ్ ప్రారంభంలోనే ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ సుంకాలు అమలులోకి వస్తే, అమెరికాకు మందులను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలకు ఖర్చులు రెట్టింపై సంస్థల ఆధాయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.






