- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్ సుప్రీం లీడర్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికాకు సహనం చాలా తక్కువని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ దక్కున్న ఖచ్చితమైన స్థావరం అమెరికాకు తెలుసని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సమయంలో అమెరికాకు ఖమేనీని చంపాలనే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలని, అమెరికాకు సహనం చాలా తక్కువని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. 'సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడనే విషయం తమకు స్పష్టంగా తెలుసు. ఆయన ఉన్న స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం తేలికైన పని. కానీ, ఇప్పటికిప్పుడు ఆయనను అంతం చేసే ఉద్దేశం లేదు. సామాన్యులు, అమెరికా సైనికులపై క్షిపని దాడులు చేయడంపై అమెరికా సహించదు. ఈ విషయంపై ఇరాన్‌కు స్పష్టత ఉండటం సంతోషించ దగ్గ విషయం. తమకు సహనం నశించక ముందే లొంగిపోవడం మంచిదని' వార్నింగ్ ఇచ్చారు. షరతుల్లేకుండా లొంగిపోవాలనే వ్యాఖ్యలను ట్రంప్ పెద్ద అక్షరాలతో పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం ఐదవ రోజుకు చేరిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్‌లో జరుగుతున్న హింస ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. వీరిలో ఎక్కువ మంది సామాన్యులే. కనీసం 24 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇరుపక్షాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. మంగళవారం రాత్రి కూడా దాడి కొనసాగింది. ఇజ్రాయెల్ వైపు ఇరాన్ క్షిపణుల దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలో ఇరాన్ గగనతలం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంది. ఇరాన్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థ, స్కై ట్రాకర్లు ఉన్నప్పటికీ, అమెరికా టెక్నాలజీతో వాటిని పోల్చలేం. ఈ క్రమంలో ఈశాన్య టెహ్రాన్ బంకర్‌లో కుటుంబంతో పాటు ఖమేనీ తలదాచుకున్నట్టు కథనాలు వచ్చాయి. పరిస్థితి ముదురుతుండటంతో ట్రంప్ ఖమేనీకి వార్నింగ్ ఇచ్చారు.






