- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాలస్తీనియన్లు తిరిగి గాజాకు వచ్చే హక్కు ఉండదు

- గాజాను అందమైన ప్రదేశంగా మారుస్తా
- పాలస్తీనీయన్లకు కోసం కొత్త ప్రాంతాలు
- వెల్లడించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనియర్లన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్ దాడులతో శిథిల నగరంగా మారిన గాజాను తాను స్వాధీనం చేసుకుంటానని ఇప్పటికే ట్రంప్ తెలిపారు. అయితే నేను గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పాలస్తీనీయన్లు తిరిగి వచ్చి నివసించడానికి హక్కు ఉండదని చెప్పారు. గాజాకు దూరంగా ఆరు ప్రాంతాల్లో ఇంత కంటే మంచి గృహాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో పాలస్తీనీయన్లు సుఖంగా నివసించవచ్చని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గాజాను తాను అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతాను. అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేస్తాను. మిడిల్ ఈస్ట్‌కు 'రివేరా'లా మారుస్తానని తెలిపారు. ఇందుకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. గాజా స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. తాజాగా జోర్డాన్ రాజు మంగళవారం వైట్ హౌస్‌లో ట్రంప్‌ను సమావేశం కానున్నారు. అంతకు ముందే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయేల్-పాలస్తీనా ఘర్షణల కారణంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాలస్తీనీయన్లు భారీగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. అయితే వీరిని భారీగా అనుమతించడం తమ దేశ భద్రతకు ముప్పుగా ఉంటుందని ఆ రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనీయన్లను తిరిగి గాజాకు రానివ్వనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత జఠిలంగా మార్చే అవకాశం ఉంది.