- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికా సహా ఆసియా మార్కెట్లన్నీ అతలాకుతలం అయ్యాయి. ఆసియా మార్కెట్లే కాదు అమెరికా మార్కెట్లు కూడా చుక్కలు చూస్తున్నాయి. అమెరికా విమోచనదినం పేరుతో భారత కాలమానం ప్రకారం రాత్రి 2గంటల ప్రాంతంలో ట్రంప్ నిరవ్హించిన మీడియా సమావేశంలో ప్రపంచ దేశాలపై టారిఫ్ బాంబులు పేల్చారు. మొదట్నుంచీ ట్రంప్ చెబుతున్నట్లుగానే ఏ దేశం మీద ఎంత టారిఫ్ విధిస్తోందీ అనేది లెక్కలతో సహా ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారి కుదేలయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధ ఫలితాలు క్షణాల్లో కనిపిస్తున్నాయి.
ఇక అమెరికా అధ్యక్షుడు తెరతీసిన వాణిజ్య యుద్ధంపై ప్రతీకారం తీర్చుకుంటానని కెనడా ప్రధాని ప్రతిజ్ఞ చేయడం దీనికి అద్దం పడుతోంది. ట్రంప్ దెబ్బకు ఆసియా మార్కెట్లు కుదేలవుతున్నాయి. జపాన్ లీడింగ్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 3.5శాతం అంటే భారీగా దాదాపు 1135 పాయింట్ల మేర పడిపోయింది. మరోవైపు అమెరికా స్వంత మార్కెట్ కూడా బాగా ప్రభావితం అవుతోంది.
నిన్న అమెరికా మిగతా మార్కెట్ ఇండెక్స్ లైన్ అమెరికా టెక్ 100, డౌజోన్స్, ఎస్ అండ్ పి సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోతోంది. భారతదేశంపై 26శాతం సుంకాలు విధించినున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇక నిఫ్టీ ఉదయం ప్రారంభం అవ్వగానే భారీగా 390 పాయింట్ల నష్టపోయింది. తర్వాత మెల్లిగా కోలుకుంటూ ఒక దశలో 140 పాయింట్ల దగ్గర కదలాడుతోంది.






