మారని తీరు.. మరోసారి టారిఫ్‌లు పెంచిన ట్రంప్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-21 16:52:26  IST  )

అమెరికా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling
X

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. మరోసారి టారిఫ్‌లు పెంచారు. ప్రపంచ దేశాలపై 10 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అన్నారు. సుంకాలు చట్టవిరుద్ధమని.. అసలు సుంకాలు విధించే హక్కు ప్రెసిడెంట్‌కు లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన మరుసటి రోజే టారిఫ్‌లు పెంచడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా, అంతకుముందు అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారు. దీనికి వారు సిగ్గుపడాలి. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు. అయితే, టారిఫ్‌ (US Tariffs)లకు సంబంధించిన సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. తాము గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటాం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.

Next Story