- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: 21 నెలల యుద్ధానికి పుల్‌స్టాప్.. గాజా సీజ్ ఫైర్‌పై ట్రంప్ కీలక ప్రకటన
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ఈ టైంలో ఇరు పక్షాలతో కలిసి యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుగుతాయని తెలిపారు. హమాస్ సైతం ఈ ఒప్పందానికి అంగీకరించాలని లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పడానికి ఖతార్ (Qatar), ఈజిప్ట్ (EGypt) దేశాలు చాలా కష్టపడ్డాయని తెలిపారు. ఈ మేరకు తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘తన ప్రతినిధులు గాజా విషయంలో ఇజ్రాయెల్ అధికారులతో సుధీర్ఘమైన చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే 60 రోజుల సీజ్ ఫైర్‌కు ఇజ్రాయెల్ అంగీకరించింది. అవసరమైన షరతులుకు ఒప్పుకుంది. ఈ టైంలో యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాం. హమాస్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తుందని ఆశిస్తున్నా, ఎందుకంటే దీనికంటే మంచి అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు.
యుద్ధాన్ని ముగించేలా ఉండాలి: హమాస్
ట్రంప్ ప్రకటనపై ఉగ్రవాద సంస్థ హమాస్ స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే సీజ్‌ఫైర్ పూర్తిగా యుద్ధాన్ని ముగించేలా ఉండాలని విజ్ఞప్తి చేసింది. హమాస్ ప్రతినిధి తాహెర్ అల్-నును మాట్లాడుతూ.. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకునే ఏ స్పష్టమైన చర్యకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కాగా, హమాస్, ఇజ్రాయెల్ మధ్య 21 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.






