- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా, చైనాలతో న్యూక్లియర్ డీల్ చేసుకునేందుకు రెడీ
రష్యా, చైనాలతో న్యూక్లియర్ డీల్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణ్వాయుధాల నియంత్రణపై రష్యా, చైనాలతో చర్చలను పునఃప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, చైనాలతో న్యూక్లియర్ డీల్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణ్వాయుధాల నియంత్రణపై రష్యా, చైనాలతో చర్చలను పునఃప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో, అమెరికా, రష్యా, చైనా.. ఈ మూడు దేశాలు రక్షణ బడ్జెట్లను సగానికి తగ్గించుకునేందుకు అంగీకరించవచ్చని ఆశిస్తున్నాని అన్నారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. దేశ అణ్వాయుధ నిరోధక వ్యవస్థను పునర్నిర్మించడంలో వందలాది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం పట్ల ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. అమెరికా ప్రత్యర్థుల నుండి వారి సొంత ఖర్చులు తగ్గించుకునేందుకు హామీలు పొందాలని భావించారు. “సరికొత్త అణ్వాయుధాలను కలిగి ఉండటం వల్ల లాభం ఏమీ లేదు. మన దగ్గర ఇప్పటికే చాలా ఉన్నాయి. మీరు ప్రపంచాన్ని 50 రెట్లు, 100 రెట్లు నాశనం చేయవచ్చు. అన్ని దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయి. అందరం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి, ఆశాజనకంగా, చాలా ఉత్పాదకత కలిగిన ఇతర విషయాలపై డబ్బుని ఖర్చు చేయవచ్చు” అని ట్రంప్ అన్నారు.
ఇరుదేశాల్లో భారీగా అణ్వాయుధాలు
పశ్చిమదేశాలు, ఉక్రెయిన్ లోని పరిస్థితులను అన్నింటినీ సరిదిద్దిన తర్వాత రష్యా, చైనా దేశాలతో అణు చర్చలు జరపుతానని ట్రంప్ అన్నారు." చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో సమావేశమవుతా. సైనిక బడ్జెట్ ని సగానికి తగ్గించుకుందామనే విషయంపై చర్చిస్తా. అది సాధ్యమే అని భావిస్తున్నా" అని ఇరు దేశాధినేతలకు చెప్తానని అన్నారు. అమెరికా, రష్యాల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పట్నుంచి ఇరుదేశాలు భారీ ఆయుధాల నిల్వలు కలిగి ఉన్నాయని ట్రంప్ అన్నారు. రాబోయే ఐదారేళ్లలో చైనా అణు విధ్వంసం చేసే సామార్థ్యాన్ని చేరుకుంటుందని ట్రంప్ అంచనా వేశారు. గతంలోనూ ట్రంప్ రష్యా, చైనాతో అణ్వాయుధ నియంత్రణ గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.






