- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Donald Trump: అమెరికాలో మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉన్నత పదవి
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ అమెరికన్ కు తన పాలకవర్గంలో చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన హర్మీత్ కె ధిల్లాన్ (Harmeet K. Dhillon)ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ట్రూత్ వేదికగా తెలిపారు. ‘‘అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా హర్మీత్ కె ధిల్లాన్‌ను నామినేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. హర్మిత్ వృత్తి జీవితంలో పౌర హక్కులను కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. కొవిడ్ సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా అడ్డుకోవడంపై న్యాయపరంగా పోరాడారు. దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదుల్లో ఆమె ఒకరు. చట్టపరమైన ఓట్లనే లెక్కించాలని ఆమె పోరాడుతున్నారు. ఈ కొత్త పదవిలో రాజ్యాంగ, పౌర హక్కులను, ఎన్నికల చట్టాలను న్యాయపరంగా అమలుచేస్తారని నమ్ముతున్నా’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. అద్భుతమైన న్యాయవాదుల బృందంలో పనిచేసేందుకు నామినేట్ అయినందుకు సంతోషంగా ఉందని ధిల్లాన్ అన్నారు. ట్రంప్ పాలకవర్గంలో భాగమైనందుకు గౌరవంగ భావిస్తున్నాని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తన కుటుంబసభ్యుల సహకారం లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఇప్పటికే ట్రంప్ పాలకవర్గంలో పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు చోటు దక్కింది. ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా డాక్టర్ జే భట్టాచార్య , డీఓజీఈ హెడ్ గా వివేక్ రామస్వామి, ఎఫ్ బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ట్రంప్ 2.0 క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
హర్మీత్ ఎవరంటే?
హర్మీత్ కె ధిల్లాన్ భారత్‌లోని చండీగఢ్‌లో జన్మించారు. ఆమె రెండేళ్లు ఉన్నప్పుడే వారి కుటుంబం అమెరికాలోని నార్త్ కరోలీనాలో స్థిరపడ్డారు.కు వెళ్లి అక్కడే స్థిరపడింది. డార్ట్‌మౌత్ కాలేజీ నుండి క్లాసికల్ స్టడీస్, ఇంగ్లీషులో పట్టా పొందారు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్‌ని పొందారు. లా క్లర్క్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. 2006లో సొంతంగా ధిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. గతేడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.