- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: ఎన్ని యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ ఇవ్వరు.. డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ సంక్షోభం సమయంలో ట్రంప్ దౌత్యపరమైన చొరవలు, మధ్యవర్తిత్వం ఒక పెద్ద యుద్ధాన్ని నివారించడానికి సహాయపడ్డాయని తెలిపింది. ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆగిపోవడానికి ఆయన చేసిన కృషి, ఇతర కారణాల వల్ల ఆయనను నోబెల్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘ప్రాంతీయంగా ఆందోళనలు తీవ్రమవుతున్న సమయంలో ట్రంప్ ఇరు దేశాల మద్య దౌత్య సంబంధాల ద్వారా గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించి చివరికి కాల్పుల విరమణ తీసుకొచ్చారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణను నివారించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు నెలకొనేవి. కాబట్టి శాంతి దూతగా ఆయనను నోబెల్ అవార్డు ఇవ్వాలి’ అని పేర్కొంది. అలాగే కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనను ప్రశంసించింది.
అయితే ఈ ప్రతిపాదనపై ట్రంప్ స్పందించారు. నేను ఎన్ని యుద్ధాలు ఆపినా, ఏమి చేసినా, నాకు నోబెల్ బహుమతి ఇవ్వబోరని తెలిపారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు. ‘భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా. రష్యా ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ వంటి వివాదాలను పరిష్కరించడంలోనూ కీలక పాత్ర పోషించా. అలాగే దశాబ్దాలుగా హింసాత్మకంగా కొనసాగిన కాంగో రువాండా శాంతి ఒప్పందాన్ని కుదర్చడానికి కృషి చేశా. ఈ విషయంలో పత్రాలపై సంతకం చేయడానికి సోమవారం రువాండా, కాంగో ప్రతినిధులు అమెరికాకు వస్తారు. ఇది ఆఫ్రికాతో పాటు ప్రపంచానికి ఎంతో గొప్ప దినం. కానీ నేను ఎన్ని చేసినా నాకు నోబెల్ శాంతి బహుమతి రాదు’ అని పేర్కొన్నారు. భారతదేశం పాకిస్తాన్ వార్, సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ శాంతి బహుమతి రాదు, ఎన్ని యుద్ధాలు ఆపినా లిబరల్స్‌కే ఇస్తారని తెలిపారు.






