- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: మోడీ గొప్ప ప్రధాని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు
భారత్, అమెరికా సంబంధాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా సంబంధాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైందని కొనియాడారు. వైట్ హౌస్‌లో ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. భారత్‌తో సంబంధాల విషయంపై ప్రశ్నించగా ట్రంప్ స్పందిస్తూ.. పీఎం మోడీ గొప్ప ప్రధాని అని ఆయనతో ఎల్లప్పుడూ స్నేహంగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇండియాతో సంబంధాలను పునరుద్ధరించడానికి తాను ఎప్పటికీ రెడీ ఉంటానని తెలిపారు. అయితే ప్రస్తుత సమయంలో మోడీ చేస్తున్నది తనకు నచ్చడం లేదని చెప్పారు. ప్రపంచ భాగస్వాముల మధ్య విభేదాలు సహజమేనని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్రిక్తతలు తాత్కాలికమేనని అవి ఇరు దేశాల సంబంధాలను బలహీనపర్చలేవని స్పష్టం చేశారు. భారత్ సహా ఇతర దేశాలతో వాణిజ్యంపై చర్చలు జరుగుతున్నాయని, సవాళ్లు ఉన్నప్పటికీ ప్రయోజనకరమైన ఒప్పందాలకు కుదర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాగా, భారత్, రష్యాలకు తాము దూరమయ్యామని చెప్పిన కాసేపటికే ట్రంప్ మాట మార్చడం గమనార్హం.
ట్రంప్ ఆలోచనలను అభినందిస్తున్నా: మోడీ
ట్రంప వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ ఆలోచనలను అభినందిస్తున్నానని తెలిపారు. ఆయనకు పూర్తి మద్దతిస్తున్నాట్టు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘అధ్యక్షుడు ట్రంప్ భావాలను, ఇరు దేశాల భాగస్వామ్యంపై అంచనాను ఎంతో అభినందిస్తున్నాం. మేము అతనికి పూర్తిగా మద్దతు ఇస్తాం. భారత్ అమెరికాలు ఎంతో సానుకూల, దార్శనిక సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
అమెరికాకు మోడీ ప్రాధాన్యత: జైశంకర్
భారత్ అమెరికాల సంబంధాలపై మోడీ, ట్రంప్‌లు చేసిన ప్రకటనలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికాతో భాగస్వామ్యానికి ప్రధాని మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మోడీ, ట్రంపునకు మధ్య వ్యక్తి గతంగా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. యూఎస్‌తో భారత్ ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోందని చెప్పారు.






