- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: స్వతహాగా దేశాన్ని వీడండి.. అక్రమ వలసదారులకు అమెరికా వార్నింగ్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు స్వతహాగా దేశాన్ని వీడాలని యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (America)లో అక్రమంగా నివసిస్తున్న వారు స్వతహాగా దేశాన్ని వీడాలని యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. ‘అమెరికాలో 30 రోజులకు పైగా నివసిస్తున్న విదేశీయులు తప్పని సరిగా ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రూల్స్ పాటించడంలో విఫలమైతే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధిస్తాం’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఓ ప్రకటనలో తెలిపింది. ‘మెసేజ్ టు ఇల్లీగల్ ఎలియెన్స్’ అనే శీర్షికతో ఈ పోస్ట్ చేసింది. అధికారుల అనుమతి లేకుండా యూఎస్‌లో ఉన్న విదేశీయులకు స్వీయ బహిష్కరణమేలని తెలిపింది. వారు స్వతహాగా దేశాన్ని వీడాలని వారికి ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించిన డబ్బును తమతో పాటే తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అంతేగాక అక్రమంగా ఉంటున్న వారు ఇక్కడి నుంచి వెళ్లే స్థోమత లేకపోతే వారికి విమాన ప్రయాణంలో రాయితీలు సైతం కల్పిస్తామని వెల్లడించింది.
ట్రంప్ పరిపాలనా విభాగం హెచ్చరికలను విదేశీ పౌరులు పట్టించుకోకపోతే కఠిన శిక్షలు ఎదుర్కొంటారని డీహెచ్ఎస్ తెలిపింది. దేశం విడిచి వెళ్లాలనే ఉత్తర్వులు అందుకున్న తర్వాత ఎవరైనా దేశాన్ని వీడకపోతే వారికి ఒక రోజుకు 998 డాలర్ల జరిమానా విధిస్తారు. అంతేగాక వెళ్లిపోతామని చెప్పి వెళ్లని వారు 1000 నుంచి 5000 డాలర్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక భవిష్యత్‌లో అమెరికాకు చట్టబద్దమైన వలసలపై నిషేధం ఉండనుంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.






