- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. ఇజ్రాయెల్ అమెరికా మధ్య విభేదాలు!
ఇరాన్ పై కలిసి యుద్దం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా అభిప్రాయ బేధం తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ (Iran) మధ్య జరుగుతున్న యుద్ధంలో తాజా పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తుండగా తాజాగా ఇజ్రాయెల్, అమెరికా మధ్య తొలిసారి విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైననాటి నుంచి రోజు రోజుకు ఇరాన్ పై యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, అమెరికా బలగాలు విరుచుకుపడుతుండగా తాజాగా ఇజ్రాయెల్ చేసిన పని పట్ల అమెరికా అసంతృప్తితో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ట్రంప్ సీరియస్!:
తాజాగా ఇరాన్‍లోని ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. దీంతో దట్టమైన పొగ మెఘాలు కమ్ముకుని అంతా ఇబ్బందులు పడ్డారు. ఈ దాడుల తీవ్రతా ఎక్కువగా ఉండటంతో ఇజ్రాయెల్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఆక్సియోస్ సంస్థ నివేదించింది. ఈ దాడులు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండటం పట్ల ట్రంప్ (Donald Trump) అసంతృప్తి వ్యక్తం చేశారని, దాడులు ఎంత 'విస్తృతంగా' ఉన్నాయో చూసి అమెరికా సైన్యం సైతం ఆశ్చర్యపోయిందని, ఇది మంచి ఆలోచన కాదని మేము భావిస్తున్నాము అని ఒక అమెరికన్ అధికారి చెప్పిన విషయాన్ని మీడియా నివేదిక ఉటంకించింది. దీంతో గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతం చేసిన తర్వాత ఈ ఇరు దేశాల మధ్య ఇదే తొలి విభేదమని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఇంకా ఇజ్రాయెల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై నెతన్యాహు (Benjamin Netanyahu) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.






