ట్రెండింగ్‌లో ట్రంప్ ఈజ్ డెడ్.. అసలేం జరిగింది?

by Ajay Maddhiboyina |

ట్రంప్ ఈజ్ డెడ్ అనేది ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. లక్షకు పైగా జనాలు ఈ యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. దీంతో అసలు ట్రంప్‌కు ఏమైంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ట్రంప్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్‌లో ట్రంప్ ఈజ్ డెడ్.. అసలేం జరిగింది?
X

దిశ, వెబ్ డెస్క్: ట్రంప్ ఈజ్ డెడ్ అనేది ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. లక్షకు పైగా జనాలు ఈ యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. దీంతో అసలు ట్రంప్‌కు ఏమైంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ట్రంప్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ట్రంప్ ధీర్ఘకాలిక సిరల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల చేతికి గాయంతో సైతం కనిపించడం ట్రంప్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు ట్రంప్ ఇటీవల మీడియా ముందుకు రాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పేర్కొంటున్నారు. గత 24 గంటల నుండి ఆయన ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.

ఆగస్ట్ 30, 31వ తేదీలలోనూ ట్రంప్‌కు సంబంధించి ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లేవని వైట్ హౌస్ షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ తీవ్ర అనోరోగ్యానికి గురయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటర్వ్యూలో దేశంలో అత్యంత విషాదకర ఘటన జరిగితే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడాతానని చెప్పడం సంచలనంగా మారింది. ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో ట్రంప్ మిస్సింగ్ అంటూ మొదట అమెరికన్లు ట్వీట్లు చేయగా ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ఆశ్చర్యకరం. ఈ ఎపిసోడ్ పై క్లారిటీ రావాలి అంటే ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ ప్రకటన చేయాల్సిందే.

Next Story