Trump: అమెరికాపై టారిఫ్ తొలగించేందుకు భారత్ సిద్ధం.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

టారిఫ్‌లపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ వస్తువులపై 100 శాతం సుంకాలను తొలగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.

Trump: అమెరికాపై టారిఫ్ తొలగించేందుకు భారత్ సిద్ధం.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ వస్తువులపై100 శాతం సుంకాలను తొలగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. యూఎస్, ఇండియా (Us india) మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం (Trade deal) కుదురుతుందని నొక్కి చెప్పారు. శనివారం ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పరస్పర వాణిజ్య ఒప్పందంపై తాము తొందరపడటం లేదని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని అభివర్ణించారు. భారతదేశంలో వ్యాపారం చేయడం దాదాపు అసాధ్యమని, కానీ అమెరికాపై సుంకాలను మినహాయించడానికి భారత్ రెడీగా ఉందన్నారు.

150కి పైగా దేశాలు అమెరికాతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాయని, అందులో దక్షిణ కొరియా కూడా ఉందన్నారు. కానీ వారందరితో అగ్రిమెంట్స్ చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా, ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చించడానికి కేంద్ర పీయూష్ గోయల్ (Peeyush goyal) అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ట్రంప్ గతంలో ఇదే తరహా కామెంట్స్ చేయగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు.

Next Story