Zelenskyy: రష్యా అబద్ధాల పుట్టలో చిక్కుకున్నాడు.. ట్రంప్ పై జెలెన్ స్కీ వ్యాఖ్యలు

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శలు గుప్పించారు. రష్యా అబద్ధాల ఉచ్చులో ట్రంప్ చిక్కున్నాడని మండిపడ్డారు.

Zelenskyy: రష్యా అబద్ధాల పుట్టలో చిక్కుకున్నాడు.. ట్రంప్ పై జెలెన్ స్కీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శలు గుప్పించారు. రష్యా అబద్ధాల ఉచ్చులో ట్రంప్ చిక్కున్నాడని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ ప్రజామోదం తగ్గిపోతోందని ట్రంప్ ఇటీవలే కామెంట్లు చేశారు.. ఈ నేపథ్యంలోన్ జెలెన్ స్కీ(Zelenskyy) సంచలన కామెంట్లు చేశారు. జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. నాకు నాలుగు శాతం ప్రజామోద రేటింగ్ ఉందనేది రష్యా నుంచి వచ్చిన తప్పుడు సమాచారం. రష్యా అబద్ధాల పుట్టలో ట్రంప్ చిక్కుకుపోయారు.’’ అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఉక్రెయిన్‌ గురించి ట్రంప్‌ టీం వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కీవ్ ప్రజలెవరూ నమ్మరని చెప్పుకొచ్చారు. రష్యా ఇచ్చే ఆఫర్లను తమ దేశ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.

ట్రంప్ ఏమన్నారంటే?

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగిస్తానని ఎప్పట్నుంచో అంటున్న ట్రంప్ ఈమేరకు రష్యాతో చర్చలు జరిపారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా.. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా రష్యా- అమెరికా విదేశాంగ మంత్రులు తొలివిడతలో చర్చలు జరిపారు. అయితే, తమ భాగస్వామ్యం లేకుండా తమ గురించి జరుగుతోన్న చర్చల్లో భాగంగా చేసుకునే ఒప్పందాలను తాము అంగీకరించబోమని ఇదివరకే ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ తరుణంలో జెలెన్ స్కీ ప్రజామోదం గురించి ట్రంప్ స్పందన వచ్చింది. జెలెన్‌స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్‌ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని ట్రంప్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

Next Story