- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: పుతిన్ కంటే అక్రమ వలసలే పెద్ద ప్రమాదం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసలే ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin) కంటే అక్రమ వలసలే ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. యూఎస్ పరిస్థితి యూరప్ లాగా మారకుండా ఉండటానికి అక్రమ వలసలను అరికట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్ (Truth social)లో పోస్ట్ చేశారు. ‘అమెరికా పరిస్థితి యూరప్ లాగా మారకుండా ఉండటానికి పుతిన్ గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. వలసదారులు అత్యాచార ముఠాలు, మాదకద్రవ్యాల మాఫియా, హంతకులు, దేశంలోకి చొరబడే వారిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి’ అని పేర్కొన్నారు.
తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే అక్రమ వలసదారుల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించగలిగానని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని స్పష్టం చేశారు. ట్రంప్, జెలెన్ స్కీ (Zelensky) మధ్య తీవ్ర వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించడానికి యూరోపియన్ యూనియన్ (Europian Union) నాయకులు లండన్‌లో శిఖరాగ్ర సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే యూరోపియన్ నాయకులు జెలెన్ స్కీకి అండగా ఉంటామని తెలిపారు. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహాయం అందిస్తామని నొక్కి చెప్పారు.






