- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: బందీలను వెంటనే రిలీజ్ చేయాలి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మిగిలి ఉన్న ఇజ్రాయెల్ (Israel) బందీలను వెంటనే విడుదల చేయాలని, మరణించిన వారి మృత దేహాలను అప్పగించాలని తెలిపారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూట్ సోషల్ (Truth social)లో పోస్ట్ చేశారు. ‘హలో ఇస్తారా లేదా వీడ్కోలు చెబుతారా మీరే నిర్ణయించుకోండి. కానీ బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలి. మరణించిన వారి మృతదేహాలను సైతం తిరిగివ్వాలి. లేకుంటే గాజా మరింత నాశనం అవుతుంది. దీనికి గాను ఇజ్రాయెల్‌కు అవసరమైన అన్ని ఆయుధాలు పంపిస్తా. చెప్పినట్టు చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుడు కూడా సురక్షితంగా ఉండడు. అవకాశం ఇచ్చినప్పుడే గాజాను విడిచిపెట్టాలి. లేదంటే ఆ తర్వాత నరకం చూపిస్తాం. ఇదే మీకు చివరి హెచ్చరిక’ అని పేర్కొన్నారు.
గాజా ప్రజలకు అందమైన భవిష్యత్ వేచి ఉందని, కానీ బందీలను హమాస్ వద్ద ఉంచుకుంటే మాత్రం అది కుదరదని తెలిపారు. ఆ ప్రాంతాన్ని వెంటనే విడిచిపెట్టాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు. వెంటనే తెలివైన నిర్ణయం తీసుకుని బందీలను రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్-హమాస్ వద్ద ఆరు వారాల కాల్పుల విరమణ అమల్లో ఉంది అయితే అందరు బందీలను హమాస్ రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
సీజ్ ఫైర్‌కు బదులుగా మాత్రమే బందీలను రిలీజ్ చేస్తాం: హమాస్
ట్రంప్ ప్రకటనపై హమాస్ స్పందించింది. శాశ్వత కాల్పుల విరమణకు బదులుగా మాత్రమే బందీలను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్, నెతన్యాహు వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రెండో దశ కాల్పుల విరమణపై చర్చలు జరపాలని, దీనిలో ఎక్కువ మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా బందీలను విడుదల చేయడం, శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ వంటివి ఉండాలని తెలిపింది.






