- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెనడా చీటింగ్ చేసింది..వాణిజ్య చర్చలన్నీ ఆపేస్తున్నా: ట్రంప్
అమెరికా సుంకాలపై కెనడాలో వచ్చిన యాడ్.. ట్రంప్‌కు కోపం తెప్పించింది. ఆ దేశంతో వాణిజ్య చర్చలన్నీ ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశం చీటింగ్ చేస్తోందని, తన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అక్రమంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవల ఒంటారియో ప్రభుత్వం ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ విడుదల చేసింది. దీనిలో సుంకాలపై యూఎస్ మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చేసిన వ్యాఖ్యలను చూపించారు. ఆయన అధికారంలో ఉండగా జరిపిన ఒక రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విదేశీ దిగుమతులపై సుంకాలు వేయడమనేది దేశభక్తితో తీసుకునే నిర్ణయంలా ఉంటుంది. కానీ అది కేవలం స్వల్పకాలమే ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంలో ఈ సుంకాలు ప్రతి అమెరికన్ పనివాడిపై, వినియోగదాడిపై భారంగా మారతాయి’ అని రీగన్ అన్నారు.
ఈ వ్యాఖ్యలను తమ యాడ్‌లో ఒంటారియో ప్రభుత్వం ఉపయోగించుకుంది. దీనిపై మండిపడిన ట్రంప్.. ‘కెనడా చీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. రొనాల్డ్ రీగన్‌కు సుంకాలంటే ఇష్టం లేదంటూ తప్పుడు యాడ్ వేశారు. దేశం కోసం, దేశభద్రత కోసం వేసే సుంకాలను ఆయన ఎప్పుడూ ప్రోత్సహించారు’ అని ప్రకటించారు. అంతర్జాతీయంగా ట్రంప్ విధించిన సుంకాలపై నవంబరు 5న యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఈ తీర్పును ప్రభావితం చేసేందుకే కెనడా ఈ యాడ్ వేసిందని ట్రంప్ ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన ఆయన.. కెనడాతో వాణిజ్య చర్చలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకించారు. ఇదే సమయంలో రొనాల్డ్ రీగన్ మాటలను ఉపయోగించుకునేందుకు ఒంటారియో ప్రభుత్వం తమ పర్మిషన్ తీసుకోలేదని ది రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ పేర్కొంది. ఆయన మాటలను వక్రీకరిస్తూ ఈ యాడ్ చేశారని విమర్శించింది. కాగా, ఈ విమర్శలపై స్పందించిన ఒంటారియో ప్రీమిర్ డాగ్ ఫోర్డ్.. ‘ప్రెసిడెంట్ ట్రంప్ మా యాడ్ గురించి విన్నారని తెలిసింది. ఆయనకు కచ్చితంగా ఇది నచ్చి ఉండదు’ అంటూ ఎద్దేవా చేశారు.






