- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మొదటి కార్డు ఎవరికంటే?
ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ (US President Trump) దూకుడు నిర్ణయాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే ధనవంతుల కోసం 'గోల్డ్ కార్డు' (Gold Card) తీసుకువస్తున్నామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ తాజాగా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడే సమయంలో తన ఫోటోతో ఉన్న గోల్డ్ కార్డును ఆయన ప్రెస్ కు చూపించారు. అయితే ఆ కార్డు మొదటి కొనుగోలు నేనే అని ట్రంప్ వెల్లడించారు. ఈబీ-5 (ఇన్వెస్టర్ వీసా) విధానాన్ని రద్దు చేసి రూ. 43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించే సంపన్న విదేశీయులకు ఈ గోల్డ్ కార్డులను అందిస్తామని ట్రంఫ్ గత ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్డును కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్డు కొనుగోలు ద్వారా అమెరికాకు ఖజానాకు ట్రిలియన్ల ఆదాయం సమకూరడం, తద్వారా దేశ రుణాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని యూఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈకార్డు ప్రకటించినప్పటి వివిధ దేశాల సంపన్నుల నుంచి మంచి స్పందన వస్తోందని ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులను విక్రయించినట్లు యూఎస్ వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు.






