- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 రోజుల్లో యుద్ధం ఆపాలంటూ రష్యాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అడుగు ముందుకేశారు.

దిశ, వెబ్ డెస్క్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అడుగు ముందుకేశారు. అయితే, ఈసారి ట్రంప్ రష్యాకు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్ (Ukraine)తో యుద్ధం ఆపేస్తూ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అత్యంత తీవ్రమైన టారిఫ్‌లను విధిస్తామని హెచ్చరించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో నాటో (NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుతైతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
'పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం' అని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు, ఉక్రెయిన్, రష్యాలకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీథ్ కెలాగ్ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. మాస్కోతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంతకుముందు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపించనున్నట్లు వెల్లడించారు.






