Trump: గెట్ అవుట్.. అందరి ముందు రిపోర్టర్ పై ట్రంప్ చిందులు.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |

లగ్జరీ బోయింగ్ విమానంపై ప్రశ్నించిన రిపోర్టర్ పై ట్రంప్ చిందులు వేశారు.

Trump: గెట్ అవుట్..  అందరి ముందు రిపోర్టర్ పై ట్రంప్ చిందులు.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఏం చేయకున్నా అన్ని నేనే అని చెప్పుకోవడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తుంటారనే చర్చ ఉంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ క్రెడిట్ కోసం పాకులాడి చివరకు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అలాంటి ట్రంప్ తాజాగా ఓ రిపోర్టర్ పై చిందులు వేశారు. తనను ప్రశ్నించిన రిపోర్టర్ పై గెట్ అవుట్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ బీసీ విలేకరి ఇటీవల ట్రంప్ కు ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ విమానం గురించి ప్రశ్నించారు. అలాంటి బహుమతి స్వీకరించడం నైతికమేనా అని ప్రశ్నించాడు. మరికొన్ని ప్రశ్నలు అడుగుతుండగా కలుగజేసుకున్న ట్రంప్.. సదరు రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఖతార్ జెట్ (Qatar jet) తో నీకేం పని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్.. వాళ్లు యూఎస్ వైమానిక దళానికి జెట్ ఇస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఇక్కడ మేము చాలా ఇతర విషయాలు మాట్లాడుతుంటే వాటిని ఎన్ బీసీ పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోంది. నువ్వు నిజమైన రిపోర్టర్ వేనా? నీకు తెలివిలేదు.. మీ మాతృసంస్థపై దర్యాప్తు చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో.. గెట్ అవుట్ అంటూ చిందులు వేశాడు. ఇదంతా అందరి ముందే జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

కాగా 400 మిలయన్ డాలర్లు విలువ చేసే బోయింగ్ 747 విమానాన్ని ఇటీవల ట్రంప్ పర్యటనకు వచ్చినప్పుడు ఖతార్ రాజకుటుంబం యూఎస్ ప్రెసిడెంట్ కు బహుమతిగా ఇచ్చింది. దీన్ని తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్ గా ఉపయోగిస్తామని పెంటగాన్ అంగీకరించింది.

Next Story