ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై కథనం.. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’పై ట్రంప్‌ పరువు నష్టం దావా

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-16 05:47:16  IST  )

సెక్స్ ట్రాఫికింగ్ (Sex Trafficking), లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణలు ఎదుర్కొన్న నేరస్థుడు దివంగత ఎప్‌స్టీన్‌ (Epstein)తో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)నకు సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవలే ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ (The New York Time) ఓ వ్యాసాన్ని ప్రచురించింది.

ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై కథనం.. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’పై ట్రంప్‌ పరువు నష్టం దావా
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్స్ ట్రాఫికింగ్ (Sex Trafficking), లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణలు ఎదుర్కొన్న నేరస్థుడు దివంగత ఎప్‌స్టీన్‌ (Epstein)తో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)నకు సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవలే ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ (The New York Time) ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ క్రమంలోనే ఆ కథనంపై స్పందించిన ట్రంప్ తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికపై ఫ్లోరిడా న్యాయస్థానంలో 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్‌’ (Truth Social)లో వెల్లడించారు.

సదరు పత్రిక మీ అభిమాన అధ్యక్షుడు, అతడి కుటుంబం, వ్యాపారాలు, దేశం గురించి దశాద్దాలుగా అబద్ధాలు చెబుతూనే ఉందని మండిపడ్డారు. ‘న్యూయార్క్ టైమ్స్’పై 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని కామెంట్ చేశారు. మన దేశ చరిత్రలో అత్యంత దిగజారిన, చెత్త పత్రికలలో అదొకటని, ‘న్యూయార్క్ టైమ్స్’ రాడికల్ లెఫ్ట్ భావజాలాలు ఉన్న డెమోక్రట్ పార్టీ (Democrat Party)కి మౌత్‌పీస్‌గా మారందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడం న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీ మధ్యలో స్పష్టంగా ప్రచురించదని గుర్తు చేశారు. పత్రికా ప్రపంచంలో ఇలా మునుపెన్నడూ జరగలేదని ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ ధ్వజమెత్తారు.

Next Story