- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: భారత్ - యూఎస్ ట్రేడ్ డీల్‌లో కీలక మార్పు.. టారిఫ్ భారీగా తగ్గింపు
భారత్ - యూఎస్ ట్రేడ్ డీల్ లో కీలక మార్పు చోటుచేసుకుంది. టారిఫ్ లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వెనక్కి తగ్గిన అమెరికా భారత్ పై టారిఫ్ లను మరింత తగ్గించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ విధించిన ట్రేడ్ డీల్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ - యూఎస్ ట్రేడ్ డీల్ పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25 శాతం టారిఫ్ లను ఈ డీల్ లో 18 శాతానికి తగ్గించిన అమెరికా.. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్ పై విధించిన 18 శాతం టారిఫ్ లను 10 శాతానికి తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టారిఫ్ లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. 150 రోజుల పాటు ఈ టారిఫ్స్ అమల్లో ఉంటాయి. ఫిబ్రవరి 24 నుంచి భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం టారిఫ్ ఉంటుంది. అయితే ఫార్మా రంగానికి, అలాగే అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA) కింద వచ్చే వస్తువులకు ఈ సుంకం నుండి మినహాయింపునిచ్చారు.
భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపు?
అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు కూడా ఈ కొత్త 10 శాతం సుంకం వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసినట్లు వెల్లడించింది. గతంలో కుదిరిన ఒప్పందాల్లో సుంకాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ప్రస్తుతానికి మాత్రం ఈ 10 శాతమే అమలవుతుంది. అయితే.. భవిష్యత్తులో ముందస్తుగా చర్చలు జరిపిన రేట్లను అమలు చేసే మార్గాలను అన్వేషిస్తామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.






